చిత్రం: ఒసేయ్ రాములమ్మ(1998 )
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం:వందేమాతరం శ్రీనివాస్
పవిత్రాణాయ సాధూనాం ఆవిరి కుప్పం విధ్వంసం వినాశాయ చదుష్క్రుతాం నీరుకొండ అమానుషం ధర్మ సంస్థాపనార్ధాయ ధరణి కోట దానవత్వం సంభవామి యుగే యుగే దళిత మనవ నాశనార్ధం ఏ అసురుడు సృస్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచించిన దారుణ కులమంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటనవేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతీ చోట మహా రక్త క్షేత్రం అడగండోయ్ అరవండోయ్ మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ మీరు అడగండోయ్ నరమేధపు మహారధం గుండెలపై నడచినా నలిగిన పేదరికం చితికి చిధ్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరినా అసహాయుల ఘోషతో దిశలు మరు మ్రోగినా కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతుంది గళమెత్తిన ధైన్యంలో జనం కుమిలిపోతుంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్టం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏ నాటికీ ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షకభట వర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధనస్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక ఉరుమై ఒక మెరుపై పిలవండోయ్ మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండోయ్ పంచముణ్ణి సృష్టించిన ఆ వంచన తల తెంచగ కదలండో..మీరు గెలవండో....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి