చిత్రం : పెళ్లి సందడి
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి: సౌందర్యలహరి సౌందర్యలహరి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురి వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి కల నుంచి ఇలచేరి కనిపించు ఓసారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి చరణం:1 పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు పాల చెక్కిల్లు దీపాల పుట్టిల్లు అదిరేటి అధరాలు హరివిల్లులు పక్కున చిందిన నవ్వులలో ఆ....ఆ.... లెక్కకు అందని రతనాలు ఆ....ఆ..... యతికైనా మతిపోయే ప్రతి భంగిమ ఎదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి చరణం:2 నీలి కన్నుల్లు నా పాలి సంకెళ్లు నీలి కన్నుల్లు నా పాలి సంకెళ్లు నను చూసి వలవేసి మెలివేయగా ఊసులు చెప్పిన గుసగుసలు ఆ.....ఆ..... శ్వాసకు నేర్పెను సరిగమలు ఆ....ఆ..... కలగంటి తెలుగింటి కలకంటిని కొలువుంటే చాలంట నా కంట సుకుమారి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి