చిత్రం: సాగర సంగమం(1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పలికే పెదవి వణికింది ఎందుకో వొణికే పెదవి వెనకాల ఏమిటో కలిసే మనసులా విరిసే వయసులా కలిసే మనసులా విరిసే వయసులా నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు ఏమేమో అడిగినా మౌనమేలనోయి ఈ మరపురాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగులా వలపు మడుగులా ఇవి ఏడడుగులా వలపు మడుగులా కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు ఎంతెంతో తెలిసినా మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి