Sagara Sangamam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sagara Sangamam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జనవరి 2022, శుక్రవారం

Sagara Sangamam : Nadavinodam Song Lyrics (నాదవినోదము)

చిత్రం: సాగర సంగమం(1983)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పిశైలజ



వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత: పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ పార్వతీప రమేశ్వరౌ నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములో ఆ భంగిమలో ఆ గానములో ఆ గమకములో ఆ భావములో భంగిమలో గానములో గమకములో ఆంగీకమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము అభినయవేదము సభకనువాదము సలుపు పరమ పదము ఆ ఆ ఆ నీనిమదనీని మదనిసనీ రిసనిదనీ మగమదాద గమామ రిగస కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం నవరస నటనం దని సరి సనిస జతియుత గమనం దని సరి సనిస నవరస నటనం జతియుత గమనం  సుతగిరి చరణం సురనుతి పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామస హరణం తపనుని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాస్యం ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన నాట్యం ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన లాస్యం నమక చమక సహజం జం నటప్రకృతీ పాదజం జం నర్తనమే శివకవచం చం నటరాజ పాద సుమరజం జం ధిర నన ధిర నన ధిర నన ధిర నన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము

10, ఆగస్టు 2021, మంగళవారం

Sagara Sangamam : Mounamelanoyi Ee Marapurani Reyi Song Lyrics (మౌనమేలనోయి ఈ మరపురాని రేయి)

చిత్రం: సాగర సంగమం(1983)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి పలికే పెదవి వణికింది ఎందుకో వొణికే పెదవి వెనకాల ఏమిటో కలిసే మనసులా విరిసే వయసులా కలిసే మనసులా విరిసే వయసులా నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు ఏమేమో అడిగినా మౌనమేలనోయి ఈ మరపురాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిట సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట ఇవి ఏడడుగులా వలపు మడుగులా ఇవి ఏడడుగులా వలపు మడుగులా కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు ఎంతెంతో తెలిసినా  మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి

1, ఆగస్టు 2021, ఆదివారం

Sagara Sangamam : Om Namah Shivaya Song Lyrics (ఓం నమశివాయ)

చిత్రం: సాగర సంగమం(1983 )

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.జానకి



ఓం... ఓం....ఓం... ఓం నమశివాయ.. ఓం నమశివాయ చంద్రకళాధర సహృదయా

ఓం... ఓం....ఓం... ఓం నమశివాయ.. ఓం నమశివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూర్ణోదయ లయ నిలయా ఓం నమశివాయ.. ఓం నమశివాయ

పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై నీ ధృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై తాపస మందారా.. ఆ... నీ మౌనమే.. దశోపనిషత్తులై ఇల వెలయా

ఓం.. ఓం.. ఓం నమశివాయ త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమే.. నీ ఆదియోగమై నీ లయలే.. ఈ కాలగమనమై కైలాస గిరివాసా నీ గానమే చంద్ర గాత్రముల శృతి కలయా

ఓం.. ఓం.. ఓం నమశివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూర్ణోదయ లయ నిలయా !!

Sagara Sangamam : Vedam Anuvanuvuna Nadam Song Lyrics (వేదం అణువణువున నాదం వేదం)

చిత్రం: సాగర సంగమం(1983 )

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, ఎస్. పి. శైలజ



గా మా నీ గమగస మగస గస నీసానిదమగ దమగ మగ సరీసానీ గమగనీ గమాగ మదామ దనీద నిసానిరీ వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం సాగర సంగమమే ఒక యోగం నిరసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయె ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయె పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలై మ్రోగా వేదం అణువణువున నాదం మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా అతిథి దేవో భవా అతిథి దేవో భవా ఎదురాయె గురువైన దైవం మొదలాయె మంజీర నాదం గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణై పోయె జీవం నటరాజ పాదాల తల వాల్చనా నయనాభిషేకాల తరియించనా నటరాజ పాదాల తల వాల్చనా నయనాభిషేకాల తరియించనా సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగా వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా : నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం

Sagara Sangamam : Thakita Thadhimi Song Lyrics (టకిట తధిమి తకిట తధిమి తందాన)

చిత్రం: సాగర సంగమం(1983 )

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం



టకిట తధిమి తకిట తధిమి తందాన హృదయలయల జతుల గతుల తిల్లాన టకిట తధిమి తకిట తధిమి తందాన హృదయలయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగులు తప్పని తాళాన తడిసిన పెదవులు రేగిన రాగాన తడబడు అడుగులు తప్పని తాళాన తడిసిన పెదవులు రేగిన రాగాన శ్రుతిని లయని ఒకటి చేసి టకిట తధిమి తకిట తధిమి తందాన హృదయలయల జతుల గతుల తిల్లాన టకిట తధిమి తకిట తధిమి తందాన హృదయలయల జతుల గతుల తిల్లాన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసీ తెలియని ఆశల లలల లలలా ఏటిలోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండి అలను అందియలుగ చేసి టకిట తధిమి తకిట తధిమి తందాన హృదయలయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగులు తప్పని తరిగిడతోం తరిగిడతోం తరిగిడతోం తడిసిన పెదవులు రేగిన ఆ ఆ ఆ శ్రుతిని లయని ఒకటి చేసి టకిట తధిమి తకిట తధిమి తందాన హృదయలయల జతుల గతుల తిల్లాన పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుక రాగ మధురం నీ బ్రతుకు నాట్య శికరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు కురియగ నాడినదే అలకల కులుకుల అలమేల్మంగ అలరులు కురియగ నాడినదే అలకల కులుకుల అలమేల్మంగ అన్న అన్నమయ్య మాట అచ్చ తేనే తెలుగు పాట పల్లవించు పద కవితలు పాడి