10, ఆగస్టు 2021, మంగళవారం

Swati Mutyam : Manasu Palike Song Lyrics (మనసు పలికే )

చిత్రం: స్వాతి ముత్యం (1986 )

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం:సి. నారాయణరెడ్డి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి




మనసు పలికే.. మనసు పలికే... మౌన గీతం.. మౌన గీతం... మనసు పలికే మౌన గీతం నేడే... మమతలొలికే.. మమతలొలికే... స్వాతిముత్యం.. స్వాతిముత్యం.. మమతలొలికే స్వాతిముత్యం నీవే... అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువూ  మనసు పలికే మౌన గీతం నేడే... మమతలొలికే స్వాతిముత్యం నీవే... 


శిరసుపై నే గంగనై మరుల జలకా లాడనీ.. మరుల జలకా లాడనీ... సగము నేను గిరిజనై పగలు రేయి వొదగానీ.. పగలు రేయి వొదగానీ... హృదయ మేళనలో మధుర లాలనలో.. హృదయ మేళనలో మధుర లాలనలో... వెలిగి పోనీ రాగ దీపం.. వెలిగి పోనీ రాగ దీపం... వేయి జన్మలు గా...

మనసు పలికే మౌన గీతం నేడే... మమతలొలికే స్వాతిముత్యం నీవే...

కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని.. ఓనమాలు దిద్దని... పేదవి పై నీ ముద్దులై మెదటి తీపి అద్దనీ.. మెదటి తీపి అద్దనీ... లలితయామినిలో కలల కౌముదిలో లలితయామినిలో కలల కౌముదిలో కరిగిపోనీ కాలమంతా.. కరిగిపోనీ కాల మంతా...కౌగిలింతలుగా

మనసు పలికే.. మనసు పలికే... మౌన గీతం.. మౌన గీతం... మనసు పలికే మౌన గీతం నేడే... మమతలొలికే.. మమతలొలికే... స్వాతిముత్యం.. స్వాతిముత్యం.. మమతలొలికే స్వాతిముత్యం నీవే... అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువూ


























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి