చిత్రం: సాగర సంగమం(1983 )
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, ఎస్. పి. శైలజ
గా మా నీ గమగస మగస గస నీసానిదమగ దమగ మగ సరీసానీ గమగనీ గమాగ మదామ దనీద నిసానిరీ వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం సాగర సంగమమే ఒక యోగం నిరసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయె ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయె పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలై మ్రోగా వేదం అణువణువున నాదం మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా అతిథి దేవో భవా అతిథి దేవో భవా ఎదురాయె గురువైన దైవం మొదలాయె మంజీర నాదం గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణై పోయె జీవం నటరాజ పాదాల తల వాల్చనా నయనాభిషేకాల తరియించనా నటరాజ పాదాల తల వాల్చనా నయనాభిషేకాల తరియించనా సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగా వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా : నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి