చిత్రం: సాగర సంగమం(1983 )
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి
ఓం... ఓం....ఓం... ఓం నమశివాయ.. ఓం నమశివాయ చంద్రకళాధర సహృదయా
ఓం... ఓం....ఓం... ఓం నమశివాయ.. ఓం నమశివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూర్ణోదయ లయ నిలయా ఓం నమశివాయ.. ఓం నమశివాయ
పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై నీ ధృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై తాపస మందారా.. ఆ... నీ మౌనమే.. దశోపనిషత్తులై ఇల వెలయా
ఓం.. ఓం.. ఓం నమశివాయ త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్ర త్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమే.. నీ ఆదియోగమై నీ లయలే.. ఈ కాలగమనమై కైలాస గిరివాసా నీ గానమే చంద్ర గాత్రముల శృతి కలయా
ఓం.. ఓం.. ఓం నమశివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూర్ణోదయ లయ నిలయా !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి