1, ఆగస్టు 2021, ఆదివారం

Sagara Sangamam : Vevela Gopemmala Song Lyrics (వే...వేలా గొపెమ్మలా మువ్వా గొపాలుడే )

చిత్రం: సాగర సంగమం(1983)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పి. శైలజ


పల్లవి :

వే...వేలా గొపెమ్మలా మువ్వా గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే
ఆ... ఆహాహా...వే....వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే
మా ముద్దు గోవిందుడే

చరణం : 1

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వెన్నకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వెన్నకాడే
కన్నతోడు లేనివాడే కన్నెతోడు వున్నవాడే
మోహనాలు వేణువుదే మోహనాంగుడితడేనే
మోహనాలు వేణువుదే మోహనాంగుడితడేనే
ఆ.... చీరలన్ని దోచి దేహచింతలన్ని తీర్చినాడే
పోతన్న కవితలన్ని, పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే

చరణం : 2

వే.....వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడేమా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే వేల పేరులున్నవాడే.....
వేయి పేరులున్నవాడే వేల పేరులున్నవాడే......
రాసలీలలాడినాడే రాయబార మేగినాడే
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
గీతార్ద సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
ఆ....ఆ...... నీలమై నిఖిలమై కాలమై నిలిచినాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే వే.... వేలా.... గోపెమ్మలా మువ్వా గోపాలుడే మాముద్దు గోవిందుడే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి