చిత్రం: స్వర్ణ కమలం (1988) సంగీతం: ఇళయరాజా గాయకులు: జానకి రచన: సీతారామ శాస్త్రి
ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా వయ్యారి వాన జల్లై దిగిరాన సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలే పల్లకీగా, దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చె తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీలే సోయగాన చందమామ మందిరాన నా కోసం సురభోగాలె వేచి నిలిచెనుగ ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి