చిత్రం: సంకీర్తన (1987)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
తందన్న తానన్న తననననా నాన తందన్న తానన్న తందన్న తానన్న తందన్న తందన్ననా మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే మనసే పాడెనులే మైమరచి మనసేపాడెనులే సెలయేటి మలుపులా విరితోటపిలుపులా ఏటి మలుపులా విరితోటపిలుపులా సరసరాగ సంకీర్తనగా నేడే మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే ఆ ఆ ఆ కోయిలలై పలికే తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో కోయిలలై పలికే తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో అందియలై మ్రోగే సందెలోనే అంచులు తాకే అందాలేవేవో జిలుగులొలుకు చెలి చెలువం లల్లా లల్లా లల్లా లల్లా కొలను విడని నవ కమలం లల్లా లల్లా లల్లా లల్లా జిలుగులొలుకు చెలి చెలువం కొలను విడని నవ కమలం అది మీటే నాలో ఒదిగిన కవితల మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే సెలయేటి మలుపులా విరితోట పిలుపులా ఏటి మలుపులా విరితోట పిలుపులా సరసరాగ సంకీర్తనగా నేడే మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే