10, ఆగస్టు 2021, మంగళవారం

Swathi Muthyam : Chinnari Ponnari Kittayya Song Lyrics (చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య )

చిత్రం: స్వాతి ముత్యం (1986)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య  చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య  అమ్మ నన్ను కొట్టింది బాబోయ్  అమ్మ నన్ను తిట్టింది బాబోయ్  ఊరుకో నా నాన్న నిన్నూరడించలేనున్న  చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య  నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక  తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో  వెన్నకై దొంగలా వెళ్ళితివేమో  మన్ను తిని చాటుగా దాగితివేమో  అమ్మా..........  మన్ను తినంగనే చిచువును  అకుంతినూ వెర్రినూ చూడు నోరు ఆ...  వెర్రిది అమ్మేరా  వెర్రిది అమ్మేరా  పిచ్చిదాని కోపంరా  పచ్చి కొట్టి పోదామా బూచికిచ్చి పోదామా  ఏడుపొత్తుంది నాకేడుపొత్తుంది  పచ్చి కొట్టి పోయామా పాలెవలు ఇస్తారు  బూచాడికిఇచ్చామా బువ్వెవలు పెడతారు చెప్పు  అమ్మతోనే వుంటాము అమ్మనొదిలి పోలేము  అన్నమైన తింటాము తన్నులైన తింటాము  కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు  చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నవాడవైతేను చెయ్యెత్తి కొట్టేను  పెద్దవాడవైతేను బుద్ది  మతి నేర్పెను  యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ  ఎవ్వరు నువ్వనీ...........  ఎవ్వరు నువ్వని నన్ను అడగకు  ఎవరు కానని విడిచి వెళ్ళకు  వెళ్ళకువెళ్ళకురా  వెళ్ళము వెళ్ళము లేమ్మా........ చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య  చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య  అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్ ఊరుకో నా నాన్న నిన్నూరడించలేనున్న చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి