చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ
ధర్మం శరణం గచ్చామి దానం శరణం గచ్చామి ఇంతో అంతో ఇచ్చినవారికి ఇహమే స్వర్గం లేదిక మరుజన్మం తెల్ల వారితే కూడు దక్కక పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులం బతుకులు ఈడ్చే అనాథలం అభాగ్యులం అనాథలం కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై ఎన్ని గడపలు ఎక్కామో ఎన్ని కాళ్ళకు మొక్కామో అభాగ్యులం అనాథలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి