చిత్రం: స్వాతి ముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:సి. నారాయణరెడ్డి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ
రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా శ్రీరామ చంద్రమూర్తి
కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ
రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు త తకిట తక జణుత
ఒసపరి చూపుల అసదుష విక్రములు
తకజణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మనసు కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు
గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషత్గణులు
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తకద తైయ్యకు తా దిమి తా..
రామాయ రామభధ్రాయ రామచంద్రాయ నమహ
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీతవంక ఓరకంట చూసినాడు సీతవంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళవిరిగెను శివధనస్సు
తనువొణికెను సీతానవవధువు
జయజయరామ రఘుకులసోమా
జయజయరామ రఘుకులసోమా
దశరధరామా దైస్యకరామ
దశరధరామా దైస్యకరామ
జయజయరామ రఘుకులసోమా
దశరధరామా దైస్యకరామ
సీతాకల్యాణ వైభొగమే
శ్రీరామ కల్యాణ వైభొగమే
సీతాకల్యాణ వైభొగమే
శ్రీరామ కల్యాణ వైభొగమే
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమనీయమే
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమనీయమే
సీతాకల్యాణ వైభొగమే
శ్రీరామ కల్యాణ వైభొగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా