11, ఆగస్టు 2021, బుధవారం

Swati Kiranam : Jaliga Jabilamma Song Lyrics (జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా)

చిత్రం: స్వాతికిరణం(1992)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: వాణి జయరామ్ గారు , కె.యస్.చిత్ర గారు

సంగీతం: శ్రీ కే.వి .మహాదేవన్ గారు



జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత పదహారు కళలని పదిలంగా ఉంచనీ ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత కాటుక కంటినీరు పెదవులనంటనీకు చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటము కన్న ఘాటైన గరళమిది గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి