చిత్రం: స్వాతికిరణం(1992)
రచన: వెన్నెలకంటి
గానం: వాణి జయరామ్
సంగీతం: శ్రీ కే.వి .మహాదేవన్ గారు
పల్లవి :
కొండా కోనల్లో లోయల్లో..గోదారి గంగమ్మ పాయల్లో.
కొండా కోనల్లో లోయల్లో...గోదారి గంగమ్మ పాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ..
కోరి కోరి కూసింది కోయిలమ్మ...ఈ కోయిలమ్మ...
కొండా కోనల్లో లోయల్లో..గోదారి గంగమ్మ పాయల్లో..
గోదారి గంగమ్మ పాయల్లో....
చరణం : 1
నేల పల్లవి ఆడంగా... నీలి మబ్బు ఆడంగా..
రివ్వున గువ్వే సాగంగా...నవ్వై మువ్వై మోగంగా...
నేల పల్లవి ఆడంగా...నీలి మబ్బు ఆడంగా.
రివ్వున గువ్వై సాగంగా...నవ్వై మువ్వై మోగంగా...
ఉంగా ఉంగా రాగంగా..ఉల్లాసాలే ఊగంగా...
ఉంగా ఉంగా రాగంగా...ఉల్లాసాలే ఊగంగా...
ఊపిరి ఊయలుగంగా...రేపటి ఆశలు తీరంగా...
తెనుగుదనం నోరురంగా... తేటగీతి గారాబంగా....
తెనుగుదనం నోరురంగా... తేటగీతి గారాబంగా...
తెమ్మరపై ఊరేగంగా... వయ్యారంగా....
చరణం : 2
ఝమ్మని తుమ్మెద తీయంగా...కమ్మని రాగం తీయంగా... జాజిమల్లి సంపెంగ ...జానపదాలే నింపంగా.... కమ్మని రాగం తీయంగా... జానపదాలే నింపంగా... చెట్టు పుట్ట నెయ్యంగా...చెట్టపట్టాలెయ్యంగా... చెట్టు పుట్ట నెయ్యంగా ..చెట్టపట్టాలెయ్యంగా... చిలుకా పలుకులు చిత్రంగా...చిలికే తేనెలు చిక్కంగా.. ఏటి పాట లాలించంగా...తోట తల్లి లాలించంగా... ఏటి పాట లాలించంగా...తోట తల్లి లాలించంగా... స్వరాలన్ని దీవించంగా...సావాసంగా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి