11, ఆగస్టు 2021, బుధవారం

Swati Kiranam : Sruthi Neevu Song Lyrics (శృతి నీవు గతి నీవు )

చిత్రం: స్వాతికిరణం(1992)

రచన: వెన్నెలకంటి

గానం: వాణి జయరామ్

సంగీతం: శ్రీ కే.వి .మహాదేవన్ గారు




శృతి నీవు గతి నీవు శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులె నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీభవ తారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి