19, ఆగస్టు 2021, గురువారం

Vamsanikokkadu : Abba Dhani Soku Song Lyrics (అబ్బా దాని సోకు తళుకో)

చిత్రం: వంశానికొక్కడు (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం అమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం చిలక పచ్చని చీరకు ముద్దు అలక పెంచుకు పోతుంటే కలవరింతల కంటికి ముద్దు కౌగిలింతకు వస్తుంటే జాణ వలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం ఓ యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం పంపర పనసల పందిట్లో బంపర ఇరుకుల సందిట్లో ఒంపులు వత్తిడి కుంపట్లో దాహం గండర గండడి దుప్పట్లో కండలు పిండిన కౌగిట్లో గుండెలో దాగిన గుప్పెట్లో మొహం గుస గుస పెరిగెను ఇప్పట్లో సల సల ముదిరిన చప్పట్లో మునుపసలెరుగని ముచ్చట్లో మైకం తకదిమి తగునుడి తప్పెట్లో ఎరుపుగ మారిన ఎన్నెట్లో తేనెగ మారిన ఎంగిట్లో దాహం నిన్ను నవిలేసి బుగ్గనెట్టు కోన నిన్ను చిదిపేసి బొట్టుపెట్టు కోన కన్నె గిలిగింత కంచెమేసి పోనా కన్ను కలిపేసి గట్టుదాటి పోనా జయహో - జతహో లయ హోరు పుడుతుంటే... అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం ఓ యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం చక చక లాడే చడుగుడులో నక నక లాడే నడుముల్లో పక పక లాడే పడుచందాలు నీవే మరదలు పిల్లా వరసల్లో మగసిరి కొచ్చే వరదల్లో కొలతలు రాని కోకందాలు నావే పెర పెర ముద్దుగ పెదవుల్లో గిర గిర లెక్కిన తనువుల్లో తహ తహ లాడే తాంబూలాలే కాయం మగసిరి పుట్టిన మంచుల్లో సొగసరి వన్నెల అంచుల్లో దులుక్కుపోయే దుడుకేనే ప్రాయం కుర్ర ఈడంత కూడు పెట్టలేన కన్నె సోకుల్లో గూడు కట్టలేన మల్లె బజ్జిల ముద్దుపెట్టు కోన గిల్లి కజ్జాల గీర లాడు కోన జయహో - జతహో ప్రియ హోరు పుడుతుంటే... అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం హో యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం ఓయ్ చిలక పచ్చని చీరకు ముద్దు అలక పెంచుకు పోతుంటే కలవరింతల కంటికి ముద్దు కౌగిలింతకు వస్తుంటే జాణ వలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి