చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
ప్రియా మహాశయా లయా చూపవేల దయా చెలీ మనోహరి సఖి మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా మాటేరాని మౌనం హాయిలో తొలి తొలి బులబాటమేదో పులకరిస్తుంటే అదే కదా కధ ముఖా ముఖి మొగమాటమేదో ములకరిస్తుంటే ఇదే పొద పదా శృతి కలిసే జతై ఇలాగే మైమరిచే క్షణాలలో ఎద సొదలె కధాకళీలై జతులడిగే జ్వరాలలో చిలక ముద్దులకు అలక పాన్పులకు జరిగిన రసమయ సమరంలో మరీ మరీ మనువాడమంటు మనవి చేస్తుంటే శుభం ప్రియం జయం అదా ఇదా తొలి రేయి అంటూ అదుముకొస్తుంటే అదో రకం సుఖం చెరిసగమై మనం ఇలాగె పెదవడిగే మజాలలో రుచిమరిగే మరి ప్రియంగా కొసరడిగే నిషాలలో ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు చలి సరి రద్దులలో
ప్రియా మహాశయా లయా చూపవేల దయా చెలీ మనోహరి సఖి మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా మాటేరాని మౌనం హాయిలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి