చిత్రం: మేఘసందేశం (1982)
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమేష్ నాయుడు
గానం: పి. సుశీల
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మవ్వంపు నటనాల మాతంగినీ కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరిమల్లినీ స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి