Megha Sandesam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Megha Sandesam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2022, బుధవారం

Megha Sandesam : Aakulo Aakunai Song lyrics (ఆకులో ఆకునై)

చిత్రం: మేఘసందేశం (1982)

సాహిత్యం: వేటూరి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: పి. సుశీల



ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై జలజలనీ పారు సెల పాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై ఆకలా దాహమా చింతలా వంతలా ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

30, అక్టోబర్ 2021, శనివారం

Megha Sandesam : Ninnatidaka Silaniana Song Lyrics (నిన్నటిదాకా శిలనైనా)

చిత్రం: మేఘసందేశం (1982)

సాహిత్యం: వేటూరి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: పి. సుశీల



నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా మవ్వంపు నటనాల మాతంగినీ కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరిమల్లినీ స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా ! నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా

Megha Sandesam : Aakasa Desana Song Lyrics (ఆకాశదేశానా ఆషాఢ మాసానా)

చిత్రం: మేఘసందేశం (1982)

సాహిత్యం: వేటూరి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: KJ. ఏసుదాస్ ఆకాశదేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా

మెరిసేటి ఓ మేఘమా విరహమో? దాహమో? విడలేని మోహమో? వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమివోలె నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన

ఆకాశదేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని శిధిల జీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుధిరభాష్పజలధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన


ఆకాశదేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా

విరహమో? దాహమో? విడలేని మోహమో? వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం