చిత్రం: సిరివెన్నెల (1986)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకది భాష్యముగ విరించినై ... జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై ... నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి