చిత్రం: స్వయంవరం(1982)
సంగీతం: సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ.... ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ.... వీచే గాలుల తాకిడీ....సాగే గువ్వల అలజడీ.... రారమ్మని పిలిచే పైబడీ.... ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ.... వీచే గాలుల తాకిడీ ....సాగే గువ్వల అలజడీ.... రారమ్మని పిలిచే పైబడీ.... ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ.... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ.... పసుపుపచ్చ లోగిలిలో పసుపుకొమ్ము కొట్టినట్టు.... నీలిరంగు వాకిలిలో పసుపాల బోసినట్టు పాదాల పారాణి అద్దినట్టూ.... పాదాల పారాణి అద్దినట్టూ.... నుదుటిపై కుంకుమ దిద్దినట్టూ.... ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ.... పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు విరబోసిన తల నిండా కనకాంబరమెట్టినట్టు ఎర్రనీళ్లు దిష్టి తీసి పోసినట్టూ కర్పూరం హారతీ ఇచ్చినట్టూ.... ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ.... వీచే గాలుల తాకిడీ.... సాగే గువ్వల అలజడీ.... రారమ్మని పిలిచే పైబడీ.... ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ.... ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి