Sirivennela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sirivennela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2023, సోమవారం

Sirivennela : Chinuku Chinuku Song Lyrics (చినుకు చినుకు చినుకు.....)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


చినుకు చినుకు చినుకు.......
తొలి  తొలి  తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు........
పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
మేఘాల రాగాల ఆలాపన
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన
మేఘాల రాగాల ఆలాపన
మేఘాల రాగాల ఆలాపన

చినుకు చినుకు చినుకు....... తొలి  తొలి  తొలకరి చిలికిన చినుకు

పిలుపు పిలుపు పిలుపు........ పుడమికి పులకల మొలకల పిలుపు



Sirivennela : Prakruti Kanthaku Song Lyrics (ప్రకృతి కాంతకు ఎన్నెన్ని)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో (2)  ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో (2) సిరివెన్నెల  ఎదపై సిరిమువ్వల సవ్వడి నీవై నర్తించగా రావేల...నిన్నే కీర్తించే వేళ ప్రకృతి కాంతకు ..... అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ  పుడమి హృదయములో (2) ఉప్పొంగి సాగింది అనురాగము ఉప్పెనగ దూకింది ఈ రాగము ప్రకృతి కాంతకు...... కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో (2) రా రా రా రమ్మని పిలిచినా కోన పిలుపు వినిపించగనే (2) ఓ  కొత్త వలపు వికసించగనే ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ప్రక్రుతి కాంతకు.....

Sirivennela : Merise taralade Rupam Song Lyrics (మెరిసే తారలదే రూపం)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :  మెరిసే తారలదే రూపం? విరిసే పూవులదే రూపం? అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం  మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం  చరణం 1 :  ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా  నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం చరణం 2 : ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలొ జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన.. నీకే నా హృదయ నివేదన.... మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం

Sirivennela : Chandamama Raave Song Lyrics (చందమామ రావే జాబిల్లి రావే)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: పి. సుశీల




చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే చలువ చందనములు పూయ చందమామ రావే జాజిపూలతావినీయ జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు విరితోటలోని గోగుపూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం రాధామాధవ గాధల రంజిల్లు బృందావనం గోపాలుని మృదుపద మంజీరము బృందావనం బృందావనం బృందావనం హే కృష్ణా మురారి జయ కృష్ణా మురారి జయ జయ కృష్ణా మురారి

Sirivennela : Aadi Bhikshuvu Song Lyrics (ఆది భిక్షువు వాడినేది కోరేది)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ... వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది



Sirivennela : Ee Gali Ee Nela Song Lyrics (ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు..)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల



ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు.. ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు.. ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి.. ఈ నేల..

చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా ఎగసేను నింగి దాకా... ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు.. ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి.. ఈ నేల..

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను

కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై గగనగళము నుండి అమర గానవాహిని గగనగళము నుండి అమర గానవాహిని జాలువారుతోంది ఇలా అమృతవర్షినీ అమృతవర్షిని ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే



31, అక్టోబర్ 2021, ఆదివారం

Sirivennela : Vidhata Talapuna Song Lyrics (విరించినై విరచించితిని ఈ కవనం)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల



విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకది భాష్యముగ విరించినై ... జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై ... నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం