చిత్రం: స్వర్ణ కమలం (1988)
సంగీతం: ఇళయరాజా గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీలరచన: సీతారామ శాస్త్రి
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు
ఎల్లలన్నదే ఎరుగని వేగంతో వెళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
లయకే నిలయమై నీపాదం సాగాలి...
మలయానిలగతిలో సుమబాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి..
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికీ.... ఆ....ఆ....ఆ....ఆ....
తిరిగే కాలానికి తీరొకటుంది....
అదినీ పాఠానికి దొరకను అంది
నటరాజస్వామి ఝాటాఝూటిలోకి చేరకుంటే
విరిచుకుపడు సురగంగకు విలువేముంది.. విలువేముంది
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
దూకేఅలలకు ఏ తాళం వేస్తారు...
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం..
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు.... ఆ... ఆ... ఆ... ఆ...
వద్దని ఆపలేరు ఉరికే ఊహని...
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె
విరివనముల పరమళముల విలువేముందీ... విలువేముందీ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లువెల్లువొచ్చి సాగని
తొలకరి అల్లర్లుపల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి