చిత్రం: అరుంధతి (2008)
రచన: సి.నారాయణ రెడ్డి
గానం: కైలాష్ ఖేర్
సంగీతం: కోటి
కమ్ముకొన్న చీకట్లోన కమ్ముకొచ్చే వెలుతురమ్మ కచ్చగట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళివమ్మా నీ కన్ను ఉరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా కుంచే పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకె అద్దమమ్మ అందరిని ఆధరించే దయమయి అన్నపూర్ణ నీవమ్మ ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మ నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణిమాతవమ్మ తీర్పులోన ధర్మమూర్తివమ్మ... జేజమ్మ మాయమ్మ జేజమ్మ ఓయమ్మ జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి