చిత్రం: బొంబాయి ప్రియుడు(1996)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
పల్లవి :
అహో ప్రియా.. క్యా బాత్ బోల చిడియా మేరా దిల్ పితర్ పితర్ హోగయా అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతేనండి అహో ప్రియా.. ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా అహో అహో అహొ ప్రియా
చరణం : 1
రాగమంత ఏలుతుందీ అనురాగ మనుపాటకీ తాళమంటు ఏలుతుందీ పెనవేసుకొను ఆటకీ మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ ముద్దు కన్న పెద్దదైన కవిత ఏముందీ జంటకోరే గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ
అహో అహో అహొ ప్రియా ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
చరణం : 2
తీయనైన స్నేహముందీ విరిసేటి పూలతీగలో తీరిపోని దాహముంది తిరిగేటీ తేనే టీగలో పూల బాల పరిమళాల కబురు పంపిందీ తేనే టీగ చిలిపి పాట బదులు పలికింది ఎన్ని సార్లో విన్నదైనా ఎందుకు ఎప్పుడూ కొత్తగా వుంటది కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతీ
అహో అహో అహొ ప్రియా ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా అహో అహో అహొ ప్రియా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి