4, నవంబర్ 2021, గురువారం

Yamudiki Mogudu : Bahusa ninnuSong Lyrics (బహుశా నిను బందర్లో చూసి ఉంటా)

చిత్రం: యముడికి మొగుడు (1988)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం:రాజ్-కోటి


పల్లవి:

బహుశా నిను బందర్లో చూసి ఉంటా తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా నీ ఒంపులో నా కొంపలే నేనెప్పుడో వేశానులే జళ్ళో పువ్వు ఒళ్ళో నువ్వు మళ్ళీ నవ్వేదింకెన్నడో బహుశా నీకు అందరిలో నచ్చి ఉంటా సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా కవ్వింపుతో నా సొంపులే కైపెక్కగా కరిగానులే ఆకు వక్క దిండు పక్క చెమ్మచెక్క ఇంకెన్నడో

చరణం:1

అటో అందము ఇటో అందము అసలే అందమంటుండగా ఒకే పరువము చెరో పక్కన ఇక నీ సొంతమౌతుండగా హేయ్...ఊసులాడి ఊరించుకో ఊపు మీద కవ్వించుకో రాత్రి పగలే రప్పించుకో రాసలీలే ఆడించుకో ఆ మాటిచ్చి ఓ మాటొచ్చి ఈ మాటిచ్చే రుచులందుకో బహుశా నీకు అందరిలో నచ్చి ఉంటా తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా

చరణం:2

పొదచాటుగా పొరపాటుగా బులపాటాలు పండించగా చెలి పైటలో చలి పాటలే యమతాళాలు వాయించగా హోయ్..పూలు పెట్టి పండందుకో పైట లాగి పాలించుకో రెచ్చగొట్టి రేయుండిపో చిచ్చుపెట్టే సిగ్గంటుకో ఒకటే పిచ్చి నీలో హెచ్చి గిల్లిగిచ్చి లాలించుకో బహుశా నిను బందర్లో చూసి ఉంటా సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా నీ ఒంపులో నా కొంపలే నేనెప్పుడో వేశానులే ఆకు వక్క దిండు పక్క చెమ్మచెక్క ఇంకెన్నడో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి