చిత్రం: దేవి పుత్రుడు (2001)
రచన: జొన్న విత్తుల రామలింగేశ్వర రావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రసన్న
సంగీతం: మణి శర్మ
పల్లవి : ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మ కుంకుమా .. పసుపు పూల వెన్నెల ..పసిడి హంస కన్నెలా చేరుమా ..చైత్రమా .. స్నేహమా .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. చరణం: అసలే ఎందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే రతి సుందరిలా దరి చేరితే చెలరేగిపోయే యవ్వనమే మగ కోరికతో మాటాడితే కొస చూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోని ఏది ఏమి కానీ ఏకమవ్వని ..రా మరి ..నా చెలి .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. చరణం : షెహనాయ్ మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో గృహ దేవతవై ఒడి చేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శృతి చేసుకో ప్రియ లాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్ని తోడు ఉండని.. ..రా మరి ..నా చెలి .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మ కుంకుమ .. పసుపు పూల వెన్నెల ..పసిడి హంస కన్నెలా చేరుమా ..చైత్రమా .. స్నేహమా ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి