Devi Putrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devi Putrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఆగస్టు 2023, ఆదివారం

Devi Putrudu : Aakasham Loni Song Lyrics (ఆకాశంలోని చందమామ )

చిత్రం: దేవి పుత్రుడు (2001)

రచన: జొన్న విత్తుల రామలింగేశ్వర రావు

గానం: ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

సంగీతం: మణి శర్మ



ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమే... ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమై... ఈ ఇంట తానే సిరిదీపమై నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసే నలుదిక్కులే పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా తీయని నవ్వేమో దివి తారల వెలుగంట కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత అడుగేసి తీస్తే హంస జోడి కులుకుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బాలామణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె నాలోని ప్రేమ ప్రతిరూపమే... ఈ ఇంట తానే సిరిదీపమే

Devi Putrudu : Keratala Aduguna Song Lyrics (కెరటాల అడుగున కనుచూపు మరుగున)

చిత్రం: దేవి పుత్రుడు (2001)

రచన: జొన్న విత్తుల రామలింగేశ్వర రావు

గానం: సుఖ్విందర్ సింగ్ స్వర్ణలత

సంగీతం: మణి శర్మ



కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నాది ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక చరణం::1 బాలకృష్ణుని బంగారు మొలతాడు చిన్నికృష్ణుని సరిమువ్వ గజ్జెలు సత్యాభామాదేవి అలకపానుపు రుక్మిణిదేవి తులసీవనము తీయని పాటల మురళి తీరైన నెమలిపింఛం కృష్ణుడు ఊదిన శంఖం శిశుపాలుని చంపిన చక్రం కనులు తెరువకుండా కథలు కథలుగా ఉన్నవి ఈనాటికి కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నాది ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక

13, నవంబర్ 2021, శనివారం

Devi Putrudu : O Prema Song Lyrics (ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ)

చిత్రం: దేవి పుత్రుడు (2001)

రచన: జొన్న విత్తుల రామలింగేశ్వర రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రసన్న

సంగీతం: మణి శర్మ


పల్లవి : ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మ కుంకుమా .. పసుపు పూల వెన్నెల ..పసిడి హంస కన్నెలా చేరుమా ..చైత్రమా .. స్నేహమా .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. చరణం: అసలే ఎందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే రతి సుందరిలా దరి చేరితే చెలరేగిపోయే యవ్వనమే మగ కోరికతో మాటాడితే కొస చూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోని ఏది ఏమి కానీ ఏకమవ్వని ..రా మరి ..నా చెలి .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. చరణం : షెహనాయ్ మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో గృహ దేవతవై ఒడి చేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శృతి చేసుకో ప్రియ లాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్ని తోడు ఉండని.. ..రా మరి ..నా చెలి .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మ కుంకుమ .. పసుపు పూల వెన్నెల ..పసిడి హంస కన్నెలా చేరుమా ..చైత్రమా .. స్నేహమా ...

22, జూన్ 2021, మంగళవారం

Devi Putrudu : Tella Tellani Cheera Song Lyrics (తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ)

చిత్రం: దేవి పుత్రుడు (2001)

రచన: జొన్న విత్తుల రామలింగేశ్వర రావు

గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ


తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ

తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ

తాకితే సితారా శృంగార శుక్ర తార

నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా 


తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ

తెల్లా తెల్లారి దాకా  చెయ్యమన్నాది కుంభమేళ


చరణం : 1

ప్రేమ గురువా ఊగరావా

పూల పొద ఉయ్యాలా

హంస లలనా చేరుకోనా కోరికల తీరాన

గొడవే నిరంతరం

ఇరువురి దరువే సగం సగం

పిలుపే ప్రియం ప్రియం

తకధిమి తపనే తళాంగు తోం తోం తోం

ఇంద్రధనసు మంచం

ఇమ్మంది వయసు లంచం

పిల్ల నెమలి పింఛం

అది అడిగెను మరి కొంచె 


తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ

తెల్లా తెల్లారి దాకా  చెయ్యమన్నాది కుంభమేళ


చరణం : 2

ప్రియ వనితా చీర మడత

చక్కచేసి ఒక్కటవనా

మీద పడనా మీగడవనా

కన్నె ఎద రాగాలా

రగిలే గులాబివే

మదనుడి సభకే నవాబువే

తగిలే సుఖానివే బిగువుల బరిలో

విహారివే... హోయ్ హోయ్ హోయ్

శోభనాల బాల ముందుందే ఇంక చాలా

జాజులా మజాలా పూగంధం పూయాలా


తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ

తెల్లా తెల్లారి దాకా చెయ్యమన్నాది కుంభమేళ

తాకితే సితారా శృంగార శుక్ర తార

నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా