చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
రచన: భాస్కరభట్ల
గానం: శ్రేయ ఘోషల్
సంగీతం: రఘు కుంచె
నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే
నిన్ను ఏనాడొ కలిసుంటె బాగుండేది
ఇంత భారంగ ఇన్నాళ్ళు లేకుండేది
నువ్వేమొ నాకని నేనేమొ నీకని
రాసాడ రాతనీ చేతుల్లొ ఈ గీతని
నువ్వే రాకుండ ఇంత దూరం నడిచాన అంటే
ఎంటో చిత్రంగ వుందే నాలొ నాకే
నువ్వే లేకుండ ఇంత కాలం బతికాన అంటే
ఏమో కలనైన నమ్మే వీలే లేదే
ఎన్నడు ఎరుగని నవ్వులని, కన్నులు చేరని వెన్నెలని
అందించావని ఆనందిస్తా, నీ తొడులో
చీకటి దాచిన వేకువని మనసుకు తెలియని వేడుకని
నువ్వొచాక నే చూస్తున్న కదా నీ ప్రేమలొ
ఎదో తింటున్నానంతే, ఎదో వుంటున్నానంతే
నువ్వే ఎదురవకపొతె, రోజూ ఇంతే
నాకె నే బరువైపోయా, నాలొ నే కరువైపోయా
నిన్నే కలిసుండకపోతే చావాలంతే
గాల్లొ రాతలు రాసుకుని నాలొ నే మాటడుకొని
గడిపేసానని గుర్తే రాదిక నీ నీడలా
నాకే తోడు దొరకదని, ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో
నిన్ను ఏనాడొ కలిసుంటే బాగుండేది
ఇంత బారంగ ఇన్నాళ్ళు లేకుండేది
నువ్వేమొ నాకని నేనేమొ నీకని రాసాడ రాతని చేతుల్లొ ఈ గీతని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి