చిత్రం: హలో బ్రదర్ (1994)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర
సంగీతం:రాజ్-కోటి
పల్లవి :
ఓ… ఓ… అబ్బా ఏందెబ్బ తీసినాడే... ఆ ఆ
ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే...హ... హ.
అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి
తిక్కలు పుడుతుంటే
దప్పిక కానీ దాహం పుట్టి
ముద్దులు పెడుతుంటే
ఓ.. ఓ… అమ్మ నీ ఊపు ఉమ్మలాట… ఆ ఆ
ఆడుకుంటాను గుమ్మలాట... హే.. ఓ
చరణం: 1 :
ఉరిమే కసి ఊర్వశి వలపుల
మెరుపులుతాకే వేళలో
తగిలిందొక యవ్వన కానుక సరిసయ్యాటలలో
బుస కొట్టిన సోకుల మిస మిస
రుస రుస లాడే వేళలో
బిగిసిందొక కౌగిలి మోతగ పిట పిట లాటలలో
పడుచు అందం తాంబూలమై పక్క పండిందిలే
ఆ...అలక పాన్పె శృంగారమై
చిచ్చు రేపిందిలే హే.. హే..
వెచ్చని రాతిరి వెన్నెల విస్తరి
వేచి వున్నది మక్కువతో
మంచపు ఆకలి మల్లెలు అల్లరి
తీర్చి వెళ్లి పోవే....
ఓ.. ఓ… అమ్మ నీ ఊపు ఉమ్మలాట… ఆ ఆ
ఆడుకుంటాను గుమ్మలాట…..హో... హో
చరణం: 2 :
నడుమెక్కడ వున్నదో తెలియక తికమక లాడే వేళలో జరిగిందొక సన్నని ఒత్తిడి జారుడు పైటలలో ఎనకేపుల షేపులు మగసిరి కైపులు పెంచేవేళలో అదిరిందొక ఆడది అల్లరి ముద్దుల తాకిడిలో పెదవి చూస్తే నీ ప్రేమకే లేఖ రాసిందిలే ఎదనుదాస్తే ఏనాటికో ఎత్తుకెడతానులే..హే.హే సిగ్గులు ఎగ్గులు నొక్కులు చేసిన చీకటింటికే చేరు చేలో మెత్తని సోకుల సొత్తులు మొత్తం దోచిపెట్టి పోవే ఓ… ఓ… అబ్బా ఏందెబ్బ తీసినాడే ఆ ఆ ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే..హ... హ. అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి తిక్కలు పుడుతుంటే దప్పిక కానీ దాహం పుట్టి ముద్దులు పెడుతుంటే ఓ..ఓ..ఓ..ఏ…ఏ…ఏ… హే… హే ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి