చిత్రం: కుమారి 21F (2015)
రచన: శ్రీ మని, అనంత శ్రీరామ్
గానం: యజిం నిజార్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా.... ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న ఈ మాయలన్నీ నీ వల్లేనా... వెళ్ళే దారిలో లేడే చంద్రుడే ఐనా వెన్నలే అది నీ అల్లరేనా.. ఓ ...చెట్టు నీడనైన లేనే పైన పూల వానా మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా... ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న ఈ మాయలన్నీ నీ వల్లేనా... కోపముంటే నేరుగా చూపకుండా ఇలా రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా మేలుకున్నా కలలతో వేస్తావుగా సంకెలా పూట పూట పొలమారుతుంటే అసలింత జాలి లేదా నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసిపోదా... మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా..ఆఅ.. మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం చూపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం సైగలోనా లేదుగా గిల్లిచేప్పే నిజం నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత ఎంతకైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట ఓ.. మన మధ్య దారంకైన దారి ఎందుకంటా మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా... ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న ఈ మాయలన్నీ నీ వల్లేనా...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి