చిత్రం: వేదం (2010)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఎం. ఎం. కీరవాణి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్ తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్ ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్ తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్ రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి