9, నవంబర్ 2021, మంగళవారం

Maharshi : Nuvvani Idhi Needani Song Lyrics (నువ్వని, ఇది నీదని )

చిత్రం: మహర్షి (2019)

రచన: శ్రీ మని

గానం: కార్తీక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువ్వనుకుంది ఇది కాదుగా నువ్వెతికింది ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది ఏ వేలో పట్టుకుని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా... నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువ్వనుకుంది ఇది కాదుగా నువ్వెతికింది ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది ఓ' ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిదా నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలయ్యిందా ఇన్నాళ్ళూ ఆకాశం ఆపేసిందా ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా గెలుపై ఓ గేలుపై నీ పరుగే పూర్తైనా గమ్యం మిగిలే ఉందా... రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా ఎన్నడూ నిను మరువనిది ఎప్పుడూ నిను విడువనిది ఓ' ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా గుండెలో గురుతయ్యినది గాయమై మరి వేచినది లోకాలే తలవంచి నిన్నే కీర్తిస్తున్నా నువ్ కోరే విజయం వేరే ఉందా నీ గుండె చప్పుడుకే చిరునామా ఏదంటే నువ్ మొదలయ్యిన చోటుని చూపిస్తోందా నువ్వొదిలేసిన నిన్నలలోకి అడుగే సాగేనా నువ్ సాధించిన సంతోషానికి అర్ధం తెలిసేనా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి