Maharshi(2019) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maharshi(2019) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, నవంబర్ 2021, గురువారం

Maharshi : Paala Pitta Song Lyrics ( పాల పిట్టలో )

చిత్రం: మహర్షి (2019)

రచన: శ్రీ మని

గానం: రాహుల్ సిప్లిగంజ్ , ఎం.ఎం.మానసి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




ఏవో గుస గుసలే  నాలో వలసి విడిసి వలపే  విరిసే  ఎదలో పాల పిట్టలో వలపు నీ పైట మెట్టు పై వాలిందే పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే  పిల్లా నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినావె కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే కొండలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే  గడపకట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే మలుపు తిరిగి నా మానసిట్ఠా నీవైపుకి మళ్ళిందే పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె  ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఎల్లా గొట్టేసినావే విల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటే  బాణాలు గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే  నా కళ్ళు నీ మాటలోని రోజాలు గుచ్చుకుంటే మరి ముళ్ళు నిప్పు పెట్టిన  తేనె పట్టులా నిద్ర పట్టదే  రాత్రుళ్ళు నీ నడుము చూస్తే మల్లె తీగ  మనసు దానినల్లే  తూనీగ  మెల్ల మెల్లగా  చల్లినావుగా కొత్త కళలు బాగా  పిల్లా నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినావె కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే పాల పిట్టలో వలపు నీ పైట మెట్టు పై వాలిందే పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే  పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె  ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఎల్లా గొట్టేసినావే


9, నవంబర్ 2021, మంగళవారం

Maharshi : Nuvvani Idhi Needani Song Lyrics (నువ్వని, ఇది నీదని )

చిత్రం: మహర్షి (2019)

రచన: శ్రీ మని

గానం: కార్తీక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువ్వనుకుంది ఇది కాదుగా నువ్వెతికింది ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది ఏ వేలో పట్టుకుని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా... నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువ్వనుకుంది ఇది కాదుగా నువ్వెతికింది ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది ఓ' ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిదా నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలయ్యిందా ఇన్నాళ్ళూ ఆకాశం ఆపేసిందా ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా గెలుపై ఓ గేలుపై నీ పరుగే పూర్తైనా గమ్యం మిగిలే ఉందా... రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా ఎన్నడూ నిను మరువనిది ఎప్పుడూ నిను విడువనిది ఓ' ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా గుండెలో గురుతయ్యినది గాయమై మరి వేచినది లోకాలే తలవంచి నిన్నే కీర్తిస్తున్నా నువ్ కోరే విజయం వేరే ఉందా నీ గుండె చప్పుడుకే చిరునామా ఏదంటే నువ్ మొదలయ్యిన చోటుని చూపిస్తోందా నువ్వొదిలేసిన నిన్నలలోకి అడుగే సాగేనా నువ్ సాధించిన సంతోషానికి అర్ధం తెలిసేనా...

Maharshi : Idhe Kadha Nee Katha Song Lyrics (ఇదే కదా ఇదే కదా నీ కథ)

చిత్రం: మహర్షి (2019)

రచన: శ్రీ మని

గానం: విజయ్ ప్రకాష్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 


ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వేతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా.. మనుష్యులందు నీ కధా...మహర్షి లాగ సాగదా మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్ధమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాను లక్ష్యమెంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా.. మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా... మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా...

7, నవంబర్ 2021, ఆదివారం

Maharshi : Padara Padara Padaraa Song Lyrics (పదర పదర పదరా)

చిత్రం: మహర్షి (2019)

రచన: శ్రీ మని

గానం: శంకర్ మహదేవన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిది రా ఈ పథమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకీ బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకీ వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా పదర పదర పదరా ఈ హలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా నీలో ఈ చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలయి ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చెలరేగే అలజడికి గెలుపల్లే మొదలయి చరితగ మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమకోసమనీ తెలిసాకా నువ్వు లక్ష్యమని తమ రక్షవనీ నినదించేలా పదర పదర పదరా నీ గతముకు కొత్త జననం ఇదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నీ ఒరవడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా తనను తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం తనలోని రుషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో తరాల వెలితి వెతికి తెచ్చిన వెలుగు రేఖవో