చిత్రం: మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (2015)
రచన: సాహితి
గానం: హరి చరణ్
సంగీతం: గోపి సుందర్
వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నిజంగా... ప్రియంగా... నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై నీవు లేని నా పయనమే... నిదురలేని ఓ నయనమే... నిన్నే వెతికి నా హృదయమే... అలిసే... సొలిసే... నిన్న తలచి ఈ రోజున... నిలుపలేక ఆవేదన... సలిపిననే ఆరాధన... दिलसे... दिलसे...(దిల్ సే) వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం వరంగ నాకోనాడే నువు కనిపించంగా ప్రియంగ మాటాడనే నే నును వెచ్చగా... ఓ... నా మనసుకే చెలిమయినదే నీ హస్తమే... నా అంతస్తుకీ కలిమయినదే నీ నేస్తమే... నీ చూపులు నా యద చొరపడెనే నీ పలుకులు మరి మరి వినపడెనే నీ గురుతులు చెదరక నిలపడెనే ఒక తీపి గతమల్లే నిండు జగతికో జ్ఞాపకం నాకు మాత్రం అది జీవితం ప్రేమ దాచిన నిష్ఠురం మదినే తొలిచే... అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం నోచుకోదులే ఏ సుఖం दिलसे... दिलसे... వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నజీరా... ఆ... నజీరా... నజీ.రా... నజీ.రా... ఓ నజీరా... నజీరా లేని లోకం ఓ పెనుచీకటే... శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే... ఓ... తన శ్వాసగా నను నిలిపెనే నా ప్రాణమే... ఓ... తన ధ్యాసలో స్పృహ తప్పెనే నా హృదయమే... తన రాతకు నేనొక ఆమనిగా... ఒక సీతను నమ్మిన రామునిగా... వనవాసము చేసెడి వేమనగా... వేచేను ఇన్నాళ్లు!! తారవా ప్రణయ ధారవా... దూరమై దరికి చేరవా... మాధురై ఎదను మీటవా... मनसे... मनसे...(మన్ సే) ప్రేమలై పొంగె వెల్లువ తేనేలే చిలికి చల్లగా తీగలా మేను అల్లవా दिलसे... दिलसे... వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నిజంగా... ప్రియంగా... నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై నీవు లేని నా పయనమే... నిదురలేని ఓ నయనమే... నిన్నే వెతికి నా హృదయమే... అలిసే... సొలిసే... నిన్న తలచి ఈ రోజున నిలుపలేక ఆవేదన సలిపిననే ఆరాధన दिलसे... दिलसे...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి