చిత్రం: మిర్చి (2013)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: కే. కే (ఖైలాష్ ఖేర్)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్నీ నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాల నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నేల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమేనిండాల మా పిల్లపాపల్లో మా ఇంటి దీపాల్లో మీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో చూసామీతిరనాళ్లు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్లు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీవాళ్లూ అయినోళ్లూ అడుగు మోపిన నిన్నుచూసి అదిరె పలనాడు ఇక కలుగు దాటి బైటపడగా బెదరడా పగవాడు పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి