చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
రచన: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటు లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే నిను వీడిపోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే సగమే నే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్నొదిలే ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే నే లేని చోటే నీ హృదయమే నువ్వు లేని కల కూడా రానే రాదే కలలాగ నువ్ మారకే మరణాన్ని ఆపేటి వరమే నీవే విరహాల విషమీయకే ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి