చిత్రం:మల్లీశ్వరి (2004)
రచన: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శ్రేయ ఘోషల్
సంగీతం: కోటి
జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం...భలే వేడుక.... ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక కోరుకున్నది ఇస్తా రా ఇక... నాయకా..ఒడే వేదిక... ఓమై డార్లింగ్ మొనాలిసా ఎక్కిందె ఏదో నిషా... మెచ్చేసానోయ్ మనోహరా.... నచ్చింది నీ తొందర.... జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం...భలే వేడుక.... మొదటి చూపుతో మురిపించి మెల్ల మెల్లగా తెర దించి.... మాయమవ్వకే నను కవ్వించీ మెత్త మెత్తగా....ముద్దిచ్చి మత్తు మత్తుగా నను గిచ్చి మంట రెపకోయ్ మైమరపించీ హఠాత్తుగా వరాలవాన వర్షించెనె ఎడారిలోన శృతించనా సుఖాలవీణా.... ఓ ప్రియతమా.... నన్నడగాలా నరోత్తమా.... నా సొగసు నీదే సుమా ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక కోరుకున్నది ఇస్తా రా ఇక... నాయకా..ఒడే వేదిక... ఎంత వింత గిలిగింత అణువు అణువునా పులకింత తనివి తీర్చవా ఎంతో కొంత తేనె పెదవిలో తొణికింత తీగ నడుములో ఒణికింత తడిమి చూడనా నీ తనువంతా.... అదేకదా వివాహ బంధం అనుక్షణం అదో సుగంధం అందించనా ప్రియా యుగాంతం ప్రేమామృతం... ఓ మై డార్లింగ్ మొనాలిసా అయ్యానే నీ బానిస ....స..స...స.... జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం...భలే వేడుక.... ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక కోరుకున్నది ఇస్తా రా ఇక... నాయకా..ఒడే వేదిక...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి