చిత్రం: పెళ్లిసందడి(2021)
రచన: చంద్రబోస్
గానం: బాబా సెహగల్ , మంగ్లీ
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
పాలకుండ నెత్తినెట్టి పంజాగుట్ట పోతావుంటే బోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు కుండపాలు గుట్టగుట్ట గుటకలేసి తాగినాడు చిల్లుపడ్డ కుండతోటి ఇంటికెట్టా పొనురా పోరాడ నీ మీద కోపమొచ్చేరా కోపమొచ్చేరా కోపమొచ్చేరా నీ బుంగమూతి సూడనీకి రాయి తోటి కొట్టినా కంటి ఎరుపు సూడనీకి కుండ పగలకొట్టినా అలక నీది సూడనీకు అల్లరేన్తో చేసినా బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు హే బుజ్జులు బుజ్జులు బుజ్జులు తినిపిస్త తీయని ముంజులు గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు హే గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కట్టుకుంటా బంగరు గజ్జెలు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కొరికి తింటా తీయని ముంజులు గోస తీరిపోయేలాగా తీసుకుంటా నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు నా గోస తీరిపోయేలాగా తీసుకుంటా నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు చమ్కీలు కోననీకి చార్మినార్ పోతావుంటే అప్సల్ గంజ్ కాడ అడ్డమొచ్చినవ్ బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ మీద జల్లినవ్ మీద జల్లినవ్ బుగ్గ మీద జల్లినవ్ బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ రంగు చూసి మా అయ్యా రంకెలేస్తడు మచ్చ చూసి మా అమ్మ రచ్చ చేస్తది పోరాడ నీతోటి పీకులాటరా హ హ హ… మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటావ్ అయ్యంటే వనుకంటావ్ నన్ను చూస్తే కులుకంటావ్ మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటావ్ అయ్యంటే వనుకంటావ్ నన్ను చూస్తే కులుకంటావ్ అందరికంటే నేను ఇష్టమంటావ్ ఇష్టమంటావ్ ఆ ముచ్చటంత లో లోనే దాచుకుంటావ్ బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు కొరికేస్తా రవ్వల గాజులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు పెట్టేస్తా కాలికి మెట్టెలు అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్న కట్టివేస్తా మేడలో పుస్తెలు అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్న కట్టివేస్తా మేడలో పుస్తెలు కట్టివేస్తా మేడలో పుస్తెలు బుజ్జులు బుజ్జులు బుజ్జులు అందుకుంటా రవ్వల గాజులు బుజ్జులు బుజ్జులు బుజ్జులు పెట్టుకుంటా కాలికి మెట్టెలు అడ్డం ఎవ్వడొచ్చిమన ఆపుతున్న కట్టమంటా మేడలో పుస్తెలు అడ్డం ఎవ్వడొచ్చిమన ఆపుతున్న కట్టమంటా మేడలో పుస్తెలు అయిపోదాం ఆలు మగలు భల్లే భల్లే భల్లే బుజ్జులు భల్లే భల్లే భల్లే బుజ్జులు భల్లే హ భల్లే హ భల్లే బుజ్జులు భల్లే హ భల్లే హ భల్లే బుజ్జులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి