చిత్రం: వాసు (2002)
రచన: పోతుల రవికిరణ్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: హారిస్ జయరాజ్
నీ జ్నాపకాలే నన్నే తరిమేనే నీ కోసం నేనే పాటై మిగిలానే చెలియా చెలియా ......ఓచెలియా పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నాగానమాగదులే ఇక నాగానమాగదులే
పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట
గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో తనువంత పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతిమనిషి ఇది పొందే అనుభూతే అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే
పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట
ఆకాశం అంచులో... ఆకాశం అంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే అపురూపం అయ్యెనులే కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నాలే కలువకు చంద్రుడు దూరం...ఓ నేస్తమా వెన్నెలకురిసే వేసే ఆ బంధం ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే
పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నాగానమాగదులే ఇక నాగానమాగదులే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి