చిత్రం: యముడికి మొగుడు (1988)
రచన: వేటూరి
గానం: మనో, పి. సుశీల
సంగీతం:రాజ్-కోటి
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా గువ్వా గూడెక్కిపోయే మావా గుండె వేడెక్కె మావా గూట్లో చటుంది రారా అయ్యో రామా ఇదిగున్నది ఈడొచ్చాక అది ఆగదు మనసిచ్చాక నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా లేచిరమ్మంటే ముందుకు జున్నంటి ముద్దుకు చంటివాడా ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా కన్నే కొట్టెసి చూడు చెయ్యే పట్టెసి చూడు ఘాటుగా కాస్త నాటుగా నన్నే చుట్టేసి చూడు చుట్టు కొలతెంతో చూడు చాటుగా చెట్టు చాటుగా ఊర్లో పాపిష్టి కళ్ళు చేలో కోపిష్టి ముళ్ళు ఒళ్లంత గుచ్చుకోవా నాకే ఇచ్చేసి ఒళ్ళు నాలో కట్టేసి ఇల్లు రేయంత రెచ్చిపోకా నీ మగసిరితోటే బేరం నా సొగసే నీకిక లాభం గుత్తి వంకాయ కూరలా గుమ్మెత్తిపోయెరా వన్నెలాడి కొత్తరాటావకాయలా చిరెత్తినప్పుడే నువ్వు జోడి ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా గువ్వా గూడెక్కిపోయే మావా గుండె వేడెక్కె మావా గూట్లో చటుంది రారా అయ్యో రామా రవ్వాలడేట్టుకుంటా రాత్రి ముద్దెట్టుకుంటా నేర్పవా దారి చూపవా ఈడే పెట్టెసుకుంటా ఈదీ ఒడ్డందుకుంటా దక్కవా చేత చిక్కవా ఉప్పుకారాలు తిన్న ఊసే నీ దగ్గరుంటే నీదంత కట్టుకోనా మునగాకడంటి నిన్ను ముద్దపప్పంటి నేను ముప్పూటలొండుకోనా నీ తట్టను నే దులిపేస్తా నీ పిట్టకు నే వల వేస్తా ఎంత బాలా కుమారుడే లీలా వినోదుడే పిల్లవాడు అబ్బా నందాకిశోరుడే అందాల చోరుడే చిన్నవాడు ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా గువ్వా గూడెక్కిపోయే భామా గుండె వేడెక్కె భామా గూట్లో రూపాయి బిల్ల నాదే భామా ఇదిగున్నది ఈడొచ్చాక అది ఆగదు మనసిచ్చాక నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా లేచిరమ్మంటే ముందుకు వచ్చాను అందుకు ముద్దులాడ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి