2, డిసెంబర్ 2021, గురువారం

Athadu : Pillagali Allari Song Lyrics (పిల్లగాలి అల్లరి)

చిత్రం: అతడు (2005)

సంగీతం: మణిశర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రేయ ఘోషల్


పిల్లగాలి అల్లరి వొళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్ర జెసి మెరుపై తరిమేనా ఎల్లలన్ని కరిగి జల్లుమంటూ ఊరికి మా కాళ్ళలో..వాకిళ్ళలో.. వేవేల వర్ణాల వయ్యారి జానా.. అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయానా

అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా.. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా.. గారంగా పిలిచేనా ఝల్లు మంటూ గుండెలోన తుంటరిగా తుళ్లుతున్న తిల్లానా

ఇంద్ర జాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్ర జాలమై తారంగాల ఒడిలో ఎల్లని మురిపించగా తారాలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా..

నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృందగానం ఇవ్వాలె పంపేనేమో ఆహ్వానం

పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి ఝళ్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగి దాక పొంగి పొగ హోరెత్తి పోతున్న గాణా బజానా చెంగు మంటూ ఆడిన చిత్రంగా జావళీలు పాడిన అందరాని చంద్రుడైనా, మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి