Athadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Athadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2022, ఆదివారం

Athadu : Athadu Song Lyrics (అదరక బదులే )

చిత్రం: అతడు (2005)

సంగీతం: మణిశర్మ

సాహిత్యం: విశ్వా

గానం: విశ్వా & కోరస్



అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే అతడే అతడే అతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే Life has made him stronger It made him work a bit harder He's got to think and act a little wiser This world has made him a fighter కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదాపడితే సమరంలో గెలిచేస్తా నే పెళపెళ ఉరుమై ఉరుముతూ జిగి ధగధగ మెరుపై వెలుగుతూ పెనునిప్పై నివురును చీల్చుతూ జడి వానై నే తలబడతా పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే చుట్టూ చీకటి వున్నా వెలిగే కిరణం అతడు తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడి దుడుకుల వల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు Life started to be faster Made him had a little think smoother He's living on the edge to be smarter This world has made him a fighter

Athadu : Pilichina Ranantava Song Lyrics (పిలిచినా రానంటావా)

చిత్రం: అతడు (2005)

సంగీతం: మణిశర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కవిత కృష్ణమూర్తి, కార్తీక్ & కోరస్




పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా నలుగురూ వున్నారంటావా ఓ ఓ చిలిపిగా చెంతకు రాలేవా.. తెలివిగా చేరే తోవా తెలియనే లేదా బావ అటు ఇటు చూస్తూ వుంటావా ఓ ఓ తటపటా ఇస్తూ వుంటావా.. సమయం కాదంటావ సరదా లేదంటావా సరసం చేదంటావా బావా.. చనువే తగదంటావా మనవే విననంటావా వరసై ఇటు రమ్మంటే నామాట మన్నించవా డోలు భాజాల ఇలా నా వెంట పడతావ చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావ డోలు భాజాల ఇలా నా వెంట పడతావ చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావ కనులుంటే సొగసే కనపడదా మనసుంటే తగుమార్గం దొరకదా.. రాననక అనుకుంటే సరిపోదే వనిత అటుపై ఏ పోరాబాటో జరగదా.. రమ్మనక పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే తరిమిన తాపం తాలదే మదనుడి బాణం తగిలితే చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి  హావ హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి పిలిచినా రానంటావా కలుసుకో లేనంటావా నలుగురూ వున్నారంటావా ఓ ఓ చిలిపిగా చెంతకు రాలేవా.. మొహమాటం పడతావ అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా .. చేరవుగా ఇరకాటం పెడతావే ఇదిగా ఆబలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా.. ఆగవుగా దరిశనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా వరాల బాలా వారిన్చువేల తరిన్చానంటు తగువెల నిగారమిట్ట జిగేలనల జనం చెడేల జవరాల  నిగారమిట్ట జిగేలనల జనం చెడేల జవరాల తనాన నానే తనాన నానే తనాన నానే తననాన  తనాన నానే తనాన నానే తనాన నానే తననాన

Athadu : Avunu Nijam Song Lyrics (అవును నిజం )

చిత్రం: అతడు (2005)

సంగీతం: మణిశర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కే.కే, సునీత




M⚘అవును నిజం నువ్వంటే నాకిష్టం F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం చలి పరదా ఇక నిలవదుగా M⚘తెలుసుకదా అఆఅఆ తెలిసిందే.. అడగాలా.. F⚘అడగందే.. అనవేలా.. M⚘చెవిలో ఇలా.. చెబితే చాలా అవును నిజం నువ్వంటే నాకిష్టం F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం F⚘కసిరేస్తున్న మనసుకు వినపడదో ఏమో విసిరేస్తున్న నినువిడి వెనకకి రాదేమో M⚘నిదరోతున్న ఎదురై కనపడతావేమో కదలాలన్న కుదరని మెలి పెడతావేమో F⚘అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో M⚘ఒంటిగా ఉండనీయనని ముందు కొస్తే ముప్పేమో F⚘మన సలహా మది వినదుకద తెలుసుకదా ఆ ఆ ఆ ఆ M⚘తెలిసే ఇలా.. చెలరేగాలా అవును నిజం నువ్వంటే నాకిష్టం F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం M⚘సుడి గాలిలో తెలియని పరుగులు తీస్తున్నా జడపూలతో చెలిమికి సమయము దొరికేనా F⚘ఎదరేముందో తమరిని వివరములడిగానా యద ఏమందో వినమని తరుముకు రాలేనా M⚘తప్పుకో.. కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంట F⚘ఒప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంట నీ జంట M⚘ నడపదుగా నిను నది వరద తెలుసు కదా ఆ ఆ ఆ ఆ F⚘ తెలిసే ఇలా ముంచెయ్యాల M⚘ అవును నిజం నువ్వంటే నాకిష్టం F⚘ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం చలి పరదా ఇక నిలవదుగా M⚘తెలుసుకదా అఆఅఆ తెలిసిందే.. అడగాలా.. F⚘అడగందే అనవేలా M⚘చెవిలో ఇలా చెబితే చాలా

2, డిసెంబర్ 2021, గురువారం

Athadu : Pillagali Allari Song Lyrics (పిల్లగాలి అల్లరి)

చిత్రం: అతడు (2005)

సంగీతం: మణిశర్మ

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రేయ ఘోషల్


పిల్లగాలి అల్లరి వొళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్ర జెసి మెరుపై తరిమేనా ఎల్లలన్ని కరిగి జల్లుమంటూ ఊరికి మా కాళ్ళలో..వాకిళ్ళలో.. వేవేల వర్ణాల వయ్యారి జానా.. అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయానా

అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా.. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా.. గారంగా పిలిచేనా ఝల్లు మంటూ గుండెలోన తుంటరిగా తుళ్లుతున్న తిల్లానా

ఇంద్ర జాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్ర జాలమై తారంగాల ఒడిలో ఎల్లని మురిపించగా తారాలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా..

నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయు వేగం ఏమైందో ఇంత కాలం ఇంతమంది బృందగానం ఇవ్వాలె పంపేనేమో ఆహ్వానం

పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి ఝళ్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగి దాక పొంగి పొగ హోరెత్తి పోతున్న గాణా బజానా చెంగు మంటూ ఆడిన చిత్రంగా జావళీలు పాడిన అందరాని చంద్రుడైనా, మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

30, జూన్ 2021, బుధవారం

Athadu : Neetho Cheppana Song Lyrics (నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన)


చిత్రం: అతడు (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా... నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా పనిమాల పైపైన పదతావెం పసికూన ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన మగువ మనసు తెలిసేన మగజాతికి మొగలి మొనలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి గారం చేసిన నయగారం చూపినా కనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచనా ఒదిగున్నా ఒరలోన కదిలించకే కురదానా కత్తిసాముతో ప్రమాదం పట్టుజారెనా పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా సొంత సొగసు బరువేనా సుకుమారికి అంత బిరుసు పరువేనా రాకుమారుడంటీ నీ రాజసానికి గారం చేసిన నయగారం చూపినా కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా... 

ఓ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ