28, డిసెంబర్ 2021, మంగళవారం

Gharshana : Cheliya Cheliya Song Lyrics (చెలియా చెలియా)

చిత్రం: ఘర్షణ (2004)

రచన: కుల శేఖర్

గానం: కే.కే , సుచిత్ర

సంగీతం: హర్రీస్ జయరాజ్


చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న

చిగురు యదలో చిటిగామారినది విరహా జ్వాలా సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో

కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా

చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న



శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలిరావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం

జాలి నాపై కలగదేమే జాఢ్యాయినా తెలియడమే ప్రతిక్షణం మనసిలా వెతికేనే నీకోసం

ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా

చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న


గుండెలోన వలపు గాయం మాన్తా రేపే పిదప కాలం ప్రాణాయామా ప్రాణాయామా తెలుసునా నీకైనా

దూరమైనా చెలిమి దీపం భారమైనా బ్రతుకు శాపం ప్రియతమా హృదయమా తరలిరా నేదైనా

కలవు కావా నా కన్నుల్లో నిముషమైన నీ కౌగిలిలో సేద తీరాలి చేరవా నేస్తమా


చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న

చిగురు యదలో చిటిగామారినది విరహా జ్వాలా సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో

కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా..ప్రియతమా





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి