చిత్రం:మల్లీశ్వరి (2004)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తీక్
సంగీతం: కోటి
పల్లవి:
నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా
నేనింత కానివాణ్ణి కాదుగదా కన్నె వయసా…. నీ కంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే ….నిన్నే…నేను కోరుకున్నది నిన్నే…. నన్నే…నన్నే… ఒప్పుకోక తప్పుడింకా నన్నే….
నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా
చరణం:1
అవును అంటే నిను చూసుకొన మహారాణి తిరుగా కాదు అంటే వదిలేసి పోను అది అంత తేలిక
లేనిపోని నకరాలు చేస్తే మరియాదా కాదుగా ఇంతమంచి అవకాశమేదీ ప్రతిసారి రాదుగా
నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా
తగని వద్దని చెలి తగవు దీనికే మరి మనకు ఎందుకె ఇలా…అల్లరి…
నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా
చరణం:2
కన్నెగానే ఉంటావా చెప్పు ఏ చెంత చెరక….. నన్ను మించి ఘనుడైనవాణ్ణి చూపించలేవుగా
మీసమున్న మగవాన్ని గనక అడిగాను సూటిగా సిగ్గు అడ్డు పడుతుంటే చిన్న సైగైనా చాలుగా
మనకి రాసి ఉన్నది… తెలుసుకోవే అన్నది బదులు కోరుతున్నది …. నామది…..
నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి