30, నవంబర్ 2021, మంగళవారం

Vasantam : Ninnu Choodaka Song Lyrics (నిను చూడక ముందర)

చిత్రం: వసంతం(2003)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హరి హారన్

సంగీతం: S.A.రాజ్ కుమార్




నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు అని మదిలో మరుమల్లెల వాన కురిసే వెల పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పలరతి బొమ్మ నలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని... రంగు రంగు పువ్వుల్లో లేనెలేదు ఈ గంధం నిన్ను తాకి పంపిదా చల్లగాలి సాయంత్రం వేళవేళ భాషల్లో లేనెలేదు ఇంతందం తేలికైన నీమాటే సుస్వరాలసంగీతం ఓ… నీలోని ఈ మౌనం కవితే అనుకొనా... నవ కవితే అనుకోనా నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుకాని దూరమైతే నాగుండె ఆగిపోదా నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని... నీలినీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు కాటుకమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు ఓ… నాలోని ఈ భావం ప్రేమ అనుకోనా... తొలిప్రేమే అనుకొనా ఈ వేళ ఈ రాగం వరమే అనుకోనా కలవరమా నిజమేనా ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక నీలాల కంటిపాప రాసింది మౌనలేఖ నిను చూడక ముందర తెలియదులె అసలందము ఉన్నదని నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదు అని మదిలో మరుమల్లెల వాన కురిసే వెల పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా ఓ పలరతి బొమ్మ నలోన ఊపిరమ్మ ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి