Malleswari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Malleswari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, డిసెంబర్ 2021, శుక్రవారం

Malleswari : Cheli Soku Song Lyrics (చెలి సోకు )

చిత్రం:మల్లీశ్వరి (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కే. కే, కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



చెలి సోకు లేత చిగురాకు  పలుకేమో కాస్త కరుకు  కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు  ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు  నీ వల్లే కాదా నాకీ చిక్కులు  కోపంలో కూడా ఎంత నాజూకు..... కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు  అన్నానంటే అన్నానంటావ్  అంతేగాని ఆలోచించవ్  నేనేకదా నీకుండే దిక్కు.... నాకోసం నువు పుట్టానంటావ్.....  నేనంటే పడి చస్తానంటావ్....  నీకెంతంట నాపై హక్కు  ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు...... పొమ్మంటూ దురం చేస్తావెందుకూ...... చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు .....  నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు.....  చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు దగ్గరకొస్తే భగ్గంటున్నవ్....  పక్కకుపోతే భయపడుతున్నవ్  ఇట్టాగైతే ఎట్టాగేమరి....  ఆపైపంటే ఈ వైపంటావ్...  నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్....  నీతో అన్నీ పేచీలేమరి  ఆ పాదం కందెలాగా పరుగులెందుకే  నీ భారం నాకే ఇవ్వకా....  మాటలో మంత్రం వేస్తూ తియ్యగా....  మైకంలో ముంచేస్తావు మల్ల మల్లగా చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు  కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు నీ వల్లే కాదా నాకీ చిక్కులు కోపంలో కూడా ఎంత నాజూకు.....


Malleswari : Nuvu Evvari Edalo Song Lyrics (నువ్వు ఎవ్వరి ఎదలో)

చిత్రం:మల్లీశ్వరి (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కోటి


నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమా నీ దారికీ కలతలే కోవెలై కొలువయే విలయమా వలపులో నరకమే వరమనే విరహమా తాపమే దీపమా వేదనే వేదమా శాపమే దీవెనా నీకిదే న్యాయమా కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా మదిలో మంటలే యాగమా ప్రణయమా నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కలా నింగినే తాకదే కడలిలో ఏ అలా నేలపై నిలవదే మెరుపులో మిల మిలా కాంతిలా కనపడే భ్రాంతి ఈ వెన్నెలా అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా నీతో పయనమే పాపమా ప్రణయమా నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో  తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమా నీ దారికీ

1, డిసెంబర్ 2021, బుధవారం

Malleswari : Nuvventa Andagattivaina song Lyrics (నువ్వెంతా అందగత్తెవైనగాని)

చిత్రం:మల్లీశ్వరి (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్

సంగీతం: కోటి


పల్లవి:

నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా

నేనింత కానివాణ్ణి కాదుగదా కన్నె వయసా…. నీ కంటికి నేనొక చిన్న నలుసా

నిన్నే ….నిన్నే…నేను కోరుకున్నది నిన్నే…. నన్నే…నన్నే… ఒప్పుకోక తప్పుడింకా నన్నే….

నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా


చరణం:1

అవును అంటే నిను చూసుకొన మహారాణి తిరుగా కాదు అంటే వదిలేసి పోను అది అంత తేలిక

లేనిపోని నకరాలు చేస్తే మరియాదా కాదుగా ఇంతమంచి అవకాశమేదీ ప్రతిసారి రాదుగా

నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా

తగని వద్దని చెలి తగవు దీనికే మరి మనకు ఎందుకె ఇలా…అల్లరి…

నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా

చరణం:2

కన్నెగానే ఉంటావా చెప్పు ఏ చెంత చెరక….. నన్ను మించి ఘనుడైనవాణ్ణి చూపించలేవుగా

మీసమున్న మగవాన్ని గనక అడిగాను సూటిగా సిగ్గు అడ్డు పడుతుంటే చిన్న సైగైనా చాలుగా

మనకి రాసి ఉన్నది… తెలుసుకోవే అన్నది బదులు కోరుతున్నది …. నామది…..

నువ్వెంతా అందగత్తెవైనగాని అంత బిరుసా…. తెగ వెంటబడుతున్నానంటే నీకు ఇంత అలుసా

30, నవంబర్ 2021, మంగళవారం

Malleswari : Janma Janmala Varami ee kalayika Song Lyrics (జన్మ జన్మల వరమీ కలయిక )

చిత్రం:మల్లీశ్వరి (2004)

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శ్రేయ ఘోషల్

సంగీతం: కోటి



జన్మ జన్మల వరమీ కలయిక  పైట కొంగుని వదలను నేనిక  పాలబుగ్గల అల్లరి పిల్లతో  శోభనం...భలే వేడుక....  ముందరున్నది ముద్దుల పండుగ  తరుముతున్నది కమ్మని కోరిక  కోరుకున్నది ఇస్తా రా ఇక...  నాయకా..ఒడే వేదిక...  ఓమై డార్లింగ్ మొనాలిసా  ఎక్కిందె ఏదో నిషా...  మెచ్చేసానోయ్ మనోహరా....  నచ్చింది నీ తొందర....  జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం...భలే వేడుక.... మొదటి చూపుతో మురిపించి  మెల్ల మెల్లగా తెర దించి....  మాయమవ్వకే నను కవ్వించీ  మెత్త మెత్తగా....ముద్దిచ్చి  మత్తు మత్తుగా నను గిచ్చి  మంట రెపకోయ్ మైమరపించీ  హఠాత్తుగా వరాలవాన  వర్షించెనె ఎడారిలోన  శృతించనా సుఖాలవీణా.... ఓ ప్రియతమా....  నన్నడగాలా నరోత్తమా....  నా సొగసు నీదే సుమా ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక కోరుకున్నది ఇస్తా రా ఇక... నాయకా..ఒడే వేదిక...    ఎంత వింత గిలిగింత  అణువు అణువునా పులకింత  తనివి తీర్చవా ఎంతో కొంత  తేనె పెదవిలో తొణికింత  తీగ నడుములో ఒణికింత  తడిమి చూడనా నీ తనువంతా....  అదేకదా వివాహ బంధం  అనుక్షణం అదో సుగంధం  అందించనా ప్రియా యుగాంతం ప్రేమామృతం...  ఓ మై డార్లింగ్ మొనాలిసా  అయ్యానే నీ బానిస ....స..స...స....  జన్మ జన్మల వరమీ కలయిక పైట కొంగుని వదలను నేనిక పాలబుగ్గల అల్లరి పిల్లతో శోభనం...భలే వేడుక.... ముందరున్నది ముద్దుల పండుగ తరుముతున్నది కమ్మని కోరిక కోరుకున్నది ఇస్తా రా ఇక... నాయకా..ఒడే వేదిక... 

20, నవంబర్ 2021, శనివారం

Malleswari : Gundello Gulabila Song Lyrcis (గుండెల్లో గులాబీల ముళ్ళు.)

చిత్రం:మల్లీశ్వరి (2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శంకర్ మహదేవన్, కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



గుండెల్లో గులాబీల ముళ్ళు....  నాటిందే నిగారాల ఒళ్ళు  నన్ను మాయజేయకే నెరజాణ..  అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు  ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు....  నిన్ను లాగలేనుగా నేనైనా....  తపోభంగమయ్యేలా...అలా కొంగు జారాలా....  మరీ బెంగ పెరిగేలా...ఇలా తొంగి చూడాలా...  అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి....  మతు చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ ....... అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు.... నిన్ను లాగలేనుగా నేనైనా....    అగ్గిలాంటి నీ అందాలు....  రగిలించగానే ఈ చన్నీళ్ళు...  ఆవిరావిరై పోతాయే సౌందర్యమా  సిగ్గుదాటి నీ ఆత్రాలు....  సొగసల్లుతుంటే సుకుమారాలు....  అల్లరల్లరైపోతాయే శృంగారమా...  నిందించి తప్పించుకోకమ్మా...  కనువిందిచ్చి కవ్వించుకోకమ్మా  నువ్వంత తెగించి రాకమ్మా... పోమ్మా..  అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి....  మతి చెదరదు ఎదురుగ కనబడితె మల్లీశ్వరీ....  అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు.... నిన్ను లాగలేనుగా నేనైనా.... కాగడాలు అనిపించేలా  నీ ఆగడాలు వెలిగించాలా  ఎక్కడెక్కడేం వున్నయో గాలించగా  స్వాగతాలు వినిపించేలా....  నీ సోయగాలు శృతిమించాలా  హెచ్చుతగ్గు లెన్నున్నయో వివరించగా  చురుక్కు చురుక్కు మనేలా....  నను కొరుక్కు కొరుక్కు తినాలా...  వయస్సు సమస్య తీరెలా రామ్మా....  అతి చిలిపిగ మదనుడు వదులిన శరమీ సొగసరి.....  మతి చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ..... అయ్యయ్యో ఇలా రాకు వెళ్ళు ఒంపుల్లోఇరుక్కుంటే కళ్ళు.... నిన్ను లాగలేనుగా నేనైనా....  తపోభంగమయ్యేలా...అలా కొంగు జారాలా.... మరీ బెంగ పెరిగేలా...ఇలా తొంగి చూడాలా... అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి.... మతు చెదరదు ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ .......