31, జనవరి 2022, సోమవారం

Aathmeeyulu : Amma Babu Song Lyrics (అమ్మ బాబు నమ్మరాదు)

 చిత్రం: ఆత్మీయులు(1968)

సాహిత్యం: కొసరాజు

గానం: ఘంటసాల , పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


పల్లవి:

అమ్మ బాబు నమ్మరాదు ఈ రాలు గాయి అబ్బాయిల నమ్మరాదు అమ్మ బాబు నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు ప్రేమించా మంటారు పెద్దగ చెబుతుంటారు పెళ్లి మాట ఎత్తగానే చల్లగ దిగజారుతారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు లవ్ మ్యారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు కట్నాలు పెరుగునని కాలేజీ కెళతారు కట్నాలు పెరుగునని కాలేజీ కెళతారు హాజరు పట్టి వేసి గైరు హాజరు అవుతారు మార్కుల కోసం తండ్రుల తీర్థయాత్ర తిప్పుతారు ఇంజనీర్లు డాక్టర్లయి ఇకచూస్కోమంటారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు

చరణం 1:

వరండాలలోన చేరి వాల్చూపులు విసురుతారు వరండాలలోన చేరి వాల్చూపులు విసురుతారు సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో, చిటికలోన అబ్బాయిల చెంగున ముడి వేస్తారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 2:

ఆస్తి ఉన్న పిల్లయితే అందం జోలికి పోరు కుంటి దైన కురూపైన పెళ్ళికి ఎస్సంటారు పెండ్లి అయిన మర్నాడే శ్రీవారిని చేతబట్టి బయటికి అత్తమామల దయ చెయ్యండంటారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

చరణం 3:

దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు మనసు మనసు తెలుసు కుందామూ.. ఇకనైనా జలసాగా కలిసి ఉందాము మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జలసాగా కలిసి ఉందాము మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జలసాగా కలిసి ఉందాము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి