చిత్రం: ఆత్మీయులు(1968)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల , పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
బంగారు కాంతులేవో నేడే తొంగి చూసెను..
అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను
తోడునీడ నీవై లాలించే అన్నయ్యా..
తల్లితండ్రి నీవై పాలించే అన్నయ్యా..
నీకన్న వేరే పెన్నిధి లేనే లేదు..
నా పూర్వ పుణ్యాల రూపమే నీవు అన్నయ్య కలలే పండెను.. చెల్లాయి మనసే నిండెను
అన్నయ్య నయనాల ఆశవు నీవే
రతనాల సుగుణాల రాణివి నీవే
అన్నయ్య నయనాల ఆశవు నీవే
నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు
నీ నవ్వు సిరులొల్కు ముత్యాలజల్ల అన్నయ్య కలలే పండెను.. చెల్లాయి మనసే నిండెను
బంగారు కాంతులేవో నేడే తొంగి చూసెను..
అన్నయ్య కలలే పండెను.. చెల్లాయి మనసే నిండెను
మా అన్నయ్య మనసె సిరిమల్లె పువ్వేను
చెల్లి కంట తడివుంటే తల్లడిల్లెను నీ పూజలే నన్ను నడిపించు తల్లి
శతకోటి విజయాలు సాధించు చెల్లి అన్నయ్య కలలే పండెను.. చెల్లాయి మనసే నిండెను
బంగారు కాంతులేవో నేడే తొంగి చూసెను..